దూరం పెట్టిందని కక్ష.. ప్రియుడి కత్తిపోట్లకు యువతి బలి!

కలం, వెబ్ డెస్క్ : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తీవ్ర కలకలం రేపిన ఘటనలో ప్రియుడి చేతిలో దాడికి గురై చికిత్స పొందుతున్న చీకటి స్వప్న మృతి (Swapna murder) చెందారు. ఎస్సీపేటకు చెందిన స్వప్న(30), ఆమె సమీప బంధువైన సుంట్రు కృష్ణారెడ్డి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే, ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో కృష్ణారెడ్డిని స్వప్న కొద్దికాలంగా దూరం పెడుతూ వస్తోంది.

తనను దూరం పెట్టిందనే కోపంతో రగిలిపోయిన కృష్ణారెడ్డి, శుక్రవారం స్వప్న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం స్వప్న ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>