జగన్ సంచలన డిమాండ్.. పులివెందులలో టెన్షన్ టెన్షన్!

కలం, వెబ్ డెస్క్ : పులివెందుల మున్సిపాలిటీకి ఎన్నిక జరుగుతున్న వేళ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) సంచలన డిమాండ్ చేశారు. పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని ఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు కేవలం 10 పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే తమ ఏజెంట్లు ఉన్నారని, మిగతా చోట్ల లేరని వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ క్రమంలోనే 70 మంది ఏజెంట్లతో ఆర్వో ఆఫీసు ముందు వైఎస్ జగన్ బైఠాయించారు.

ఈ సందర్భంగా తెలుగుదేశం రౌడీలు ఇష్టారాజ్యంగా ఎన్నికల్లో తమకు అనుకూలంగా పోలింగ్ నిర్వహించుకుంటున్నారని వైఎస్ జగన్ విముర్శలు గుప్పించారు. పోలింగ్ బూత్ ల్లోకి వైసీపీ ఏజెంట్లను అనుమతించడం లేదని పులివెందుల ఆర్వో చిన్నయ్యకు తెలిపారు. తాను పిలుపునిస్తే ఇవాళ ఎన్నికలు జరిగేవి కావని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు సంప్రదాయం కొనసాగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు. దాడుల వివరాలు, దొంగ ఓట్లు వేస్తున్న తీరును ఆర్వోకు వివరించిన జగన్.. తక్షణమే పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ శ్రేణులు పులివెందుల ఆర్వో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>