రేవంత్​ రెడ్డికి కవిత బహిరంగ లేఖ.. కీలక విషయాలు ప్రస్తావన..!

కలం, వెబ్​ డెస్క్​: సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) బహిరంగ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణనపై దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఓబీసీల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఓబీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం అందాల్సిన ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రాజకీయ పార్టీ ఓబీసీల డిమాండ్లకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు.

ఎస్సీ, ఎస్టీల జనాభా నమోదు చేసినట్టుగానే ఓబీసీల జనాభాను ప్రత్యేకంగా నమోదు చేయాలని కవిత కోరారు. దీనికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. డిసెంబర్ నెల నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తీర్మానం చేయాలని ఆమె (TRS Chief Kavitha) విజ్ఞప్తి చేశారు. ఆదివాసీల జీవన విధానం అత్యంత ప్రత్యేకమైనదని.. వారి మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేయాల్సిన అవసరం ఉన్నదని కవిత అభిప్రాయడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో జనగణనలో ఆదివాసీల మతాన్ని ప్రత్యేకంగా నమోదు చేయాలని కోరుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని  లేఖలో కోరారు. ప్రత్యేక అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్​ రెడ్డికి కవిత సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>