19వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల స‌మ్మె

కలం, నాగర్‌కర్నూల్: ఎన్‌హెచ్ఎం జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న నిరవధిక సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు (NHM Employees) తమ చేతులకు సంకెళ్లు వేసుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల నుంచి విముక్తి కల్పించి, తమకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఈ నిరసన ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ మాట్లాడుతూ.. గత 19 రోజులుగా ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం బాధాకరమన్నారు.

ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం సేవలందిస్తున్న త‌మ‌కు కూడా ఒక సురక్షితమైన భవిష్యత్తు ఉండాలని చెప్పారు. త‌మ సేవలను గుర్తించి 78 కేడర్ల ఎన్‌హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, త‌మ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన హక్కులు సాధించే వరకు ఐక్యంగా, శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, హైమావతి, శ్రీనివాసులు, డాక్టర్ రామకృష్ణ, ప్రవీణ్ కుమార్, గోపి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>