కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేకి: రావు పద్మా రెడ్డి

కలం, హనుమకొండ: కాజీపేటలోని సోమిడి వడ్డెర కాలనీలో హనుమాన్ విగ్రహాన్ని అధికారులు తొలగించడంపై బీజేపీ నేత రావు పద్మా రెడ్డి (Rao Padma Reddy) ఫైర్ అయ్యారు. వంద కుటుంబాలు ఏళ్లుగా రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న గద్దెపై వినాయక, హనుమాన్ పూజలు నిర్వహిస్తున్నాయని, హనుమాన్ విగ్రహాన్ని అర్ధరాత్రి తొలగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ఇతర మతాల నిర్మాణాల విషయంలో ఒకలా, హిందూ దేవతల విగ్రహాల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

హిందూ సంఘాలతో ఆందోళన..

శాయంపేట, హైదరాబాద్‌లో రాముడి విగ్రహాల తొలగింపు ఘటనల తర్వాత తాజాగా కాజీపేటలో హనుమాన్ విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని రావు పద్మా రెడ్డి వ్యాఖ్యానించారు. విగ్రహం తొలగింపుతో ఆవేదనకు గురైన స్థానికులకు మద్దతు తెలిపేందుకు ఘటనా స్థలానికి వెళ్తున్న తనను సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని రావు పద్మా రెడ్డి మండిపడ్డారు. వడ్డెర కాలనీలో గతంలో విగ్రహం ఉన్న చోటే తిరిగి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు, స్థానికులు, హిందూ సంఘాలతో కలిసి ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>