కరీంనగర్ ఐడీఓసీలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం

కలం, కరీంనగర్‌ : రాజనీతిజ్ఞుడు, ఉక్కు మనిషి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశ సమైక్యత, సమగ్రతను పెంచేందుకు అందరం కృషి చేద్దామని కలెక్టర్ చిత్రా మిశ్రా (Collector Chitra Mishra) పేర్కొన్నారు. శనివారం దేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో జాతీయ ఐక్యతా దినోత్సవం (National Unity Day) నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, సిబ్బంది చేత రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు.

దేశ ఐకమత్యం భద్రతను కాపాడేందుకు అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పటేల్ ముందు చూపు, కార్యదక్షతతో సంస్థానాలను దేశంలో విలీనం చేశారన్నారు. కుల మతాలు, ప్రాంతాలకు అతీతంగా అలాంటి మహనీయులు చూపిన బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో అందరం పాలు పంచుకుందామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ స్వామి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>