సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

కలం, కరీంనగర్‌ : కరీంనగర్‌ శ్రీ సరస్వతీ శిశు మందిర్ (Saraswati Shishu Mandir) ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో భారతదేశ ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధానమంత్రి, దేశ ఐక్యతకు ప్రతీక అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (Sardar Vallabhbhai Patel Jayanti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్య మోర రణదీర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆయన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోషించిన కీలక పాత్రను, స్వాతంత్ర్యం అనంతరం సంస్థానాల విలీనంలో చూపిన నాయకత్వ పటిమను విద్యార్థులకు వివరించారు. దేశ సమగ్రత, ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ భావన వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆచార్యులు సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, ఎలగందుల సత్యనారాయణ, గట్టు శ్రీనివాస్, కొత్తూరి ముకుందం, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, ఎలగందల శ్రీనివాస్, పులాల శ్యామ్ అప్పిడి వకుళా దేవి, తాటిపర్తి రాజేశ్వర్ రావు, ఆచార్యులు మరియు విద్యార్థులు పాల్గొన్నారని పాఠశాల ప్రధానాచార్య మోర రణధీర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>