కలం, నిజామాబాద్ బ్యూరో: సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ ఐక్యత కోసం కృషి చేసిన మహానుభావుడు అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) అన్నారు. పటేల్ జయంతి సందర్భంగా శనివారం నగరంలోని వర్ని చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 562 సంస్థాలను విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తి దాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు కల్పే అర్చనా చిరంజీవి, జగదీష్ కులకర్ణి, మల్కాయి మహేందర్, మఠం పవన్, న్యాలం సునీత రాజు తదితరులు పాల్గొన్నారు.

