ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు అందించాలి: శ్రీనివాస్ గౌడ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో సర్వం కోల్పోయిన ప్రజలకు నిత్యావసర సరుకులు అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. శనివారం మహబూబ్ నగర్ (Mahabubnagar) మండల పరిధిలోని మాచన్ పల్లి (Machanpally) లో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు.

కరెంటు లేక పంటలు ఎండిపోయాయని, రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆదుకోక పోతే రైతులు తిరగబడుతారని ఆయన హెచ్చరించారు. రైతులు తినడానికి ఇంట్లో గింజలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేశామని, అప్పులు తీర్చేందుకు వలసలు పోయే పరిస్థితులు ప్రస్తుతం దాపురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి పంట వేయవద్దు అని చెప్పిన ప్రభుత్వం రైతులకు రైతు బంధుతో పాటు, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల హామీలో వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇస్తామని అన్నారని, ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ. 36 వేలు బాకీ ఉన్నారని, వీటిని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలన్నారు. భూములు అమ్మడం.. మోసం చేయడం తప్ప కాంగ్రెస్‌కు పాలించడం చేతకాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు మల్లు నర్సింహా రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మండల పార్టీ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>