ఇందిరా చౌక్‌లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

కలం, ​కరీంనగర్ : దేశ మాజీ ప్రధాని, స్వర్గీయ ఇందిరా గాంధీ (Indira Gandhi) వర్ధంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, బీసీసెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్‌లతో కలిసి అంజన్ కుమార్ ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

​పేదల ఆశాజ్యోతి ఇందిరా గాంధీ ​అనంతరం వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రజల ఆశాజ్యోతి ఇందిరా గాంధీ అని కొనియాడారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ‘గరీబీ హటావో’ నినాదంతో ప్రతి పేదవాడికి ‘రోటీ, కపడా, మకాన్’ (కూడు, గుడ్డ, గూడు) అందించిన మహానేత ఇందిరమ్మ అని అన్నారు. దేశాన్ని అనేక రంగాలలో అభివృద్ధి బాటలో నడిపించి, ప్రపంచ అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత ఆమెకే దక్కుతుందన్నారు. ​

రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పాలన ఆనాడు ఇందిరా గాంధీ అందించిన స్ఫూర్తితోనే నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పాలనందిస్తోందని తెలిపారు. రేవంత్ నాయకత్వంలో చేపడుతున్న ప్రజా పాలన కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడి కళ్లల్లో ఆనందం చూస్తున్నామని పేర్కొన్నారు. ​​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున రాజేందర్, పడిశెట్టి భూమయ్య, అబ్దుల్ రహమాన్, మహమ్మద్ ఖాజా, ఫహద్, మాదాసు శ్రీనివాస్, వంగల విద్యాసాగర్, పెంట శేఖర్, శిల్ప, వీర దేవేందర్ పటేల్, సరిల్ల రతన్ రాజు, ఎండి ఆమేర్, చింతల కిషన్, స్వప్న, ఎండి వసీం తదితర కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>