కలం, నిర్మల్: ఓటు హక్కును కాలరాసే విధంగా ఉందని ఆరోపిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఏఐఎస్ఎఫ్ (AISF) ఆధ్వర్యంలో శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో మౌన నిరసన (Silent Protest) చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కైలాష్ మాట్లాడుతూ.. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన కీలక ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ఓటరు జాబితాల సవరణ పేరుతో ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగించకూడదని కోరారు. జాబితాల సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఓటు హక్కు పరిరక్షణలో ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియపై పునరాలోచన చేయాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అస్లాం, నాయకులు వినేష్, అఖిల్, సిద్ధు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

