పేదల ఆకలి తీర్చిన ఇందిరాగాంధీ సేవలు చిరస్మరణీయం: శ్రీహరి రావు

కలం, నిర్మల్: దేశంలోని పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన నాయకురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) అన్నారు. శనివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత తొలి మహిళా ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. గరీబీ హఠావో నినాదంతో పేదల సంక్షేమానికి కృషి చేసిన ఘనత ఇందిరాగాంధీకి దక్కుతుందన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ దేశ తొలి మహిళా ప్రధానిగా పాలనలో తనదైన ముద్ర వేశారని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ఠను చాటిచెప్పిన ఉక్కుమహిళగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు గాజుల రవికుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ భీంరెడ్డి, నాయకులు నాందేడపు చిన్ను, అయ్యన్నగారి పోశెట్టి, సబా కలీం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>