సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో ముందుకు సాగాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా స్పూర్తితో మనమంతా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. భారత తొలి ఉప ప్రధాని, మాజీ హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151 వ జయంతి (Sardar Vallabhbhai Patel Jayanti) సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరెట్‌లోని సమావేశ మందిరంలో జాతీయ ఐక్యతా దినోత్సవం (National Unity) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐక్యతా ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించడమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఉక్కుమనిషి పటేల్ అని కొనియాడారు. అధికారులు, సిబ్బంది అంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని తెలిపారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>