సీజ్ చేసిన బంగారం తాకట్టు.. కానిస్టేబుల్ అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రవణ్ అనే కానిస్టేబుల్ (Meerpet Constable) సీజ్ చేసిన విలువైన వస్తువులను దుర్వినియోగం చేసిన ఘటన కలకలం రేపింది. ఒక కేసులో సీజ్ చేసిన మొబైల్ ఫోన్ నుంచి రూ.1.70 లక్షలను ఆన్‌లైన్ ద్వారా అక్రమంగా బదిలీ చేసుకున్న ఆయన, మరో కేసులో స్వాధీనం చేసుకున్న బంగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి రూ.12.37 లక్షల నగదు తీసుకున్నట్లు విచారణలో తేలింది.

తన తండ్రి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆయన వైద్య చికిత్సల కోసం భారీగా ఖర్చు కావడంతోనే తాను ఈ తప్పు చేయాల్సి వచ్చిందని శ్రవణ్ పోలీసుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో అంతర్గత విచారణ జరిపి నిజాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి ఇటీవల మరణించినట్లు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>