నేరాల నియంత్రణకు నిరంతర నిఘా: ఎస్పీ అఖిల్ మహాజన్

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణతోపాటు ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) పోలీసు సిబ్బందికి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని, గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యపానం, మట్కా వంటి కార్యకలాపాలను అరికట్టాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ నాణ్యమైన దర్యాప్తుతో నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ (SP) సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని సత్వర పరిష్కారం చూపాలని, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. గంజాయి నిర్మూలనలో విశేష కృషి చేసే పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు అందజేస్తామని ఎస్పీ ప్రకటించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>