నెర్మట స్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై ప్రశంసలు

కలం, మునుగోడు: విద్యార్థులకు చదువు చెప్పడమే కాదు, అవసరమైన సౌకర్యాలు కల్పించేలా బాధ్యత తీసుకున్న ప్రధానోపాధ్యాయుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చండూరు మండలం నెర్మట (Nermata) గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దోటి మధుమోహన్ సొంత వేతనం నుంచి రూ.30 వేలు ఖర్చు చేసి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వైట్ యూనిఫాంలను కొనుగోలు చేయించి అందించారు. సర్పంచి నారపాక వసంత దనయ్య, పుల్లెంల క్లస్టర్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్.సరస్వతి చేతుల మీదుగా విద్యార్థులకు ఈ దుస్తులను పంపిణీ చేశారు.

ప్రధానోపాధ్యాయుడు మధుమోహన్ గతంలో కస్తూరి ఫౌండేషన్ సహకారంతో సుమారు రూ.4 లక్షలు వెచ్చించి పాఠశాల భవనానికి రంగులు, మరుగుదొడ్ల నిర్మాణం, గోడలపై ఆకర్షణీయమైన విద్యాబోధన చిత్రాలు వేయించారు. దివీస్ ఫార్మా కంపెనీని సంప్రదించి పాఠశాలకు వాటర్ ఫిల్టర్లను కూడా ఏర్పాటు చేయించారు. దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్, తిరుమని సుధాకర్, సీహెచ్.పద్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మన్ నారపాక జయమ్మ, అటెండర్ రావుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>