కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధే లక్ష్యం: AMC ఛైర్మన్

కలం, కరీంనగర్: నగర వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని చెక్‌పోస్టులో ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్ (AMC Chairman Akula Narasanna).. డీఎం షాబుద్దీన్, సెక్రటరీ సయ్యద్ హమీద్ అలీతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు వద్ద జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించి, విధుల నిర్వహణ తీరును సమీక్షించారు.

వ్యవసాయ మార్కెట్‌లో పారదర్శకతను పెంపొందించడంతో పాటు, మార్కెట్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు మెరుగైన సేవలు అందించడం, మార్కెట్ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయ మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తనిఖీలు చేశారు. రైతుల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>