మహిళా కండక్టర్‌పై దాడి అమానుషం: కూనంనేని

​కలం, ఖమ్మం బ్యూరో: విధి నిర్వహణలో ఉన్న మహిళా కండక్టర్‌పై దాడి చేయడం అత్యంత అమానుషమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోకు చెందిన కండక్టర్ గుండ్ల ప్రవళికపై ఇటీవల ప్రయాణికులు దాడి చేసి బస్సు కిందకు తోసేయడంతో ఆమె రెండు కాళ్లతో పాటు శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని సాయి సంజీవిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

​ఈ నేపథ్యంలో శుక్రవారం ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే కూనంనేని.. బాధితురాలు ప్రవళికను స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య చికిత్స వివరాలను అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రవళికకు ఎలాంటి లోటు లేకుండా అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆయన సూచించారు.

​కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం ప్రాంతానికి చెందిన ప్రవళిక, తండ్రి మరణానంతరం వచ్చిన వారసత్వ ఉద్యోగంతో కుటుంబాన్ని ఎంతో కష్టపడి పోషిస్తోందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. నిత్యం విధుల్లో కష్టపడి పనిచేసే ఇలాంటి నిజాయితీపరులైన మహిళా ఉద్యోగులపై దాడులు జరగడం విచారకరమన్నారు. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబానికి పూర్తి ధైర్యం చెప్పిన ఆయన, బాధితురాలు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>