ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘన.. 14 సంస్థలపై చర్యలు

కలం, ఆదిలాబాద్ : ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ, ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి బి. ప్రత్యూష స్పష్టం చేశారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం కింద ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ఆహార వ్యాపార సంస్థలపై నమోదు చేసిన 14 కేసుల (Adilabad Food Safety) ను న్యాయనిర్ణయ అధికారి, అదనపు కలెక్టర్ ఆర్ ఎస్ చిత్రు విచారించి పరిష్కరించినట్లు ఆమె తెలిపారు.

ఈ కేసుల్లో సంబంధిత సంస్థలకు మొత్తం రూ.3.55 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, ఆహార తయారీ, విక్రయ సంస్థల నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయాల సమయంలో నాణ్యత, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రతి ఆహార వ్యాపార సంస్థ చెల్లుబాటయ్యే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండటంతో పాటు, దానిని వినియోగదారులకు కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని సూచించారు. నిబంధనలు పాటించని సంస్థలపై తనిఖీలు నిర్వహించి, చట్టప్రకారం జరిమానాలు విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>