విజయ్​ సర్కార్​ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో వయోపరిమితి పెంపు

కలం, వెబ్​ డెస్క్​: ప్రభుత్వ ఉద్యోగార్థులకు తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం​ శుభవార్త తెలిపింది. అన్ని రిక్రూట్‌మెంట్ బోర్డుల పరిధిలో ప్రభుత్వ సర్వీసుల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని పెంచుతూ విజయ్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి గరిష్ఠ వయోపరిమితిని 5 సంవత్సరాలు పెంచుతూ సీఎం విజయ్​ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సీఎం విజయ్ (CM Vijay) ప్రకటించిన ఈ నిర్ణయం ఐదు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. నియామకాలలో జాప్యం కారణంగా వయోపరిమితి వల్ల అనర్హతకు గురైన అభ్యర్థుల దీర్ఘకాల డిమాండ్ల ఆధారంగా రాష్ట్ర (Tamil Nadu) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. బీసీ, ఎంబీసీ, ఎస్సీ, ఎస్టీ, నిరుపేద వితంతు అభ్యర్థులకు ఇప్పటికే ఉన్న వయో సడలింపులకు అదనంగా ఈ ఐదేళ్ల పెంపు ఉంటుంది.

Also Read : సౌరవ్ దాస్‌కు మద్రాస్ హై కోర్టు నోటీసులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>