రైతులకు ఎమ్మెల్యే యెన్నం భరోసా.. కొనుగోళ్లపై కీలక ప్రకటన!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని, రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. హన్వాడ మండలంలోని కిష్టంపల్లి (Kistampally) గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని పేర్కొన్నారు.

రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం అందించడంతో పాటు, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, మహిళా అధ్యక్షురాలు నవనీత, నాయకులు టంకర కృష్ణయ్య యాదవ్, యాదిరెడ్డి, బొట్టు శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నయ్య, డీజే రాజు, పాండు నాయక్, శ్రీనివాస్ రెడ్డి, నారాయణ రెడ్డి, అంజిలయ్య, వెంకట్ రెడ్డి, తుపుడ కృష్ణయ్య, కృష్ణయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>