సౌరవ్ దాస్‌కు మద్రాస్ హై కోర్టు నోటీసులు

కలం, వెబ్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ కో–కన్వీనర్ సౌరవ్ దాస్‌ (Saurav Das)కు మద్రాస్ హై కోర్టు నోటీసులు జారీ చేసింది. జడ్జిలను కించపరుస్తూ సౌరవ్ దాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన నేపథ్యం, తల్లిదండ్రులు, అధికారిక గుర్తింపు, పాస్ పోర్టు వివరాలను తనిఖీ చేయాలంటూ కాంచీపురం జిల్లాకు చెందిన గణేశ్ కుమార్ అనే వ్యక్తి మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి, జస్టిస్ అరుల్ మురుగన్ ధర్మాసనం సౌరవ్ దాస్‌తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపించింది.

పాస్ పోర్ట్ రద్దు చేయండి..

ఒకవేళ సౌరవ్ దాస్‌ (Saurav Das) విదేశీయుడు అని తేలితే వెంటనే పాస్ పోర్ట్, ఆధార్ కార్డులు రద్దు చేయడంతో పాటు ఎక్స్ అకౌంట్‌ను కూడా బ్లాక్ చేసేలా కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని గణేశ్ కుమార్ కోరారు. సౌరవ్ దాస్ న్యాయ వ్యవస్థను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ తరఫు లాయర్ సీజేకు వివరించారు. వృత్తిరీత్యా జర్నలిస్ట్ అయిన సౌరవ్ దాస్ కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి జాతీయ అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హై కోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

Also Read : గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల వేట!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>