కలం, వెబ్ డెస్క్ : ఏపీఎస్ఆర్టీసీ మాజీ ఎండీ, రిటైర్డ్ ఐపీఎఐస్ అధికారి ఎన్. బాలసుబ్రహ్మణ్యం (Balasubrahmanyam) మృతి చెందారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం కన్నుమూశారు. 1994 బ్యాచ్ ఏపీ కేడర్‌కు చెందిన బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 30న పదవీ విరమణ చేశారు. గతంలో ఒంగోలు, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎస్పీగా సేవలు అందించారు. పోలీసింగ్, ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో ఐటీ సంస్కరణలు, ట్రాన్స్పోర్ట్ శాఖలో సేవలను డిజిటల్‌గా మార్చడంలో బాలసుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం..
మాజీ ఏపీఎస్ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం (Balasubrahmanyam) మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు. సుబ్రహ్మణ్యం సమగ్రత, అంకితభావం, ప్రజా సేవలను రెండు రాష్ట్రాల సీఎంలు ప్రశంసించారు. “బాలసుబ్రహ్మణ్యం మృతి బాధాకరం. నిబద్ధత కలిగిన వ్యక్తిగా పోలీస్ వ్యవస్థలో ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. బాలసుబ్రహ్మణ్యం మృతదేహాన్ని మూడు రోజుల్లోగా హైదరాబాద్‌కు తీసుకురానున్నట్లు సమాచారం.

