కలం, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఘోర హెలీకాఫ్టర్ ప్రమాదం (Helicopter Crash) చోటుచేసుకుంది. నేడు బద్రీనాథ్ నుంచి తిరుగు ప్రయాణమైన ఒక హెలీకాఫ్టర్ జోషీమఠ్‌లోని ఛాయీ గ్రామం సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాద సమయంలో హెలీకాఫ్టర్‌లో ఐదుగురు ప్రయాణికులు, ఒక పైలట్ సహా మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. మధ్యాహ్నం 2:15 గంటలకు బద్రినాథ్ నుంచి బయలుదేరిన ఈ హెలీకాఫ్టర్, భారీ హిమపాతం కారణంగా ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు పైలట్‌తో ఎలాంటి సంబంధం లేకపోవడంతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదంపై అధికారిక ప్రకటన, ప్రయాణికుల పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

