కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని నర్కూడ (Narkhuda) గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది అతి వేగంగా వచ్చిన టయోటా ఇన్నోవా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ కారు పలుమార్లు పల్టీలు కొట్టడంతో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కాగా ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

