భువీని పక్కనబెట్టడం పక్కా.. అశ్విన్ కామెంట్స్!

క‌లం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. మరోవైపు, నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvneshwar Kumar) మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో నాలుగో టీ20లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశాలపై చర్చ మొదలైంది. భువీ స్థానంలో మయాంక్‌ యాదవ్‌ లేదా స్పిన్నర్‌ను ఆడించవచ్చని మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) సూచించాడు. భువనేశ్వర్‌ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక వికెట్‌ మాత్రమే తీశాడు.

ఈ క్రమంలో 139 పరుగులు సమర్పించుకున్నాడు. అతడి ఎకానమీ రేటు 11.58గా ఉంది. నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన భువీకి ఈ సిరీస్‌ ఆశించిన విధంగా సాగడం లేదు. మూడో టీ20లో భువనేశ్వర్‌ బౌలింగ్‌పై అశ్విన్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అతడి బౌలింగ్‌లో గతంలో కనిపించిన వేగం తగ్గిందని, బంతిని స్వింగ్‌ చేయించడంలోనూ ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిందని అభిప్రాయపడ్డాడు. ఈ ప్రదర్శనను నిరాశాజనకంగా అభివర్ణించాడు.

భువీ స్థానంలో మయాంక్‌ యాదవ్‌ను లేదా ఓ స్పిన్నర్‌ను తీసుకోవచ్చని అశ్విన్‌ (Ravichandran Ashwin) తెలిపాడు. అయితే, మిగిలిన రెండు మ్యాచ్‌లు చిన్న మైదానాల్లో జరగనున్న నేపథ్యంలో స్పిన్నర్లను ఆడించే విషయంలో జట్టు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. మైదాన పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక మారవచ్చన్నాడు. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 అక్టోబర్‌ 30న ఆక్లాండ్‌లో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌.. మిగిలిన మ్యాచ్‌ల్లో జట్టు కూర్పులో మార్పులు చేసే అవకాశం ఉంది.

Also Read : సైబర్ బాధితులకు రిలీఫ్​.. బ్యాంకులదే బాధ్యత!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>