కలం, వెబ్‌డెస్క్ : అర్నాబ్ తుఫాన్ (Arnab Cyclone) ప్రభావం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు (Akividu) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్‌ఫోన్లలో ఛార్జింగ్ లేకపోవడంతో అత్యవసర అవసరాల కోసం ఆకివీడు రైల్వే స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు క్యూలైన్లలో నిల్చుంటున్నారు.
బంధువుల సమాచారం తెలుసుకోవడంతో పాటు డిజిటల్ చెల్లింపులు చేసుకోవడానికి ఫోన్ ఛార్జింగ్ తప్పనిసరి కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు తమ సొంత ప్లగ్ బాక్సులను తీసుకొచ్చి, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ పాయింట్ల వద్ద కూడా ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నిత్యావసర పనులకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read : సైబర్ బాధితులకు రిలీఫ్.. బ్యాంకులదే బాధ్యత!
Follow Us On : WhatsApp

