వేసవిలో నీటి ఎద్దడి రాకూడదు.. అధికారులకు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు!

కలం, జన్నారం: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరులను సంరక్షిస్తూ, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించుకోవాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ (MLA Vedma Bojju Patel) సూచించారు. జన్నారం (Jannaram) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గ్రామాల్లో నీటి వృథాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని సూచించారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సర్పంచులకు స్పష్టం చేశారు. నీటి సంరక్షణ ఆవశ్యకతపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ, నీటి వనరుల పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>