విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

కలం, వలిగొండ: విద్యార్థులలో నైపుణ్యాలను పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anurag Jayanthi) అన్నారు గురువారం వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (ZP High School) ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పదవ తరగతి, ఆరు, ఏడు తరగతి విద్యార్థులతో చదివించడంతోపాటు సబ్జెక్టు సంబంధించిన ప్రశ్నలు అడిగి విద్యార్థులకు మనోధైర్యాన్ని కల్పించారు.

విద్యార్థులు చదవడం రాయడంలో నైపుణ్యత సాధించాలని పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా డే కృషి చేయాలని అన్నారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, నీటిని వృధా చేయకుండా విద్యార్థులకు అవగాహన కల్పించాలని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఇఓ బిక్షపతి, తహసిల్దార్ దశరథ, ఎంఈఓ సుంకోజ్ భాస్కర్, హెచ్ ఎం ధనలక్ష్మి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>