పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యం: మేయర్

కలం, నల్గొండ : నల్గొండ నగర పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతరం శ్రమించే కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం  నగరపాలక సంస్థ కార్యాలయంలో శ్రీ సత్య డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల (Municipal Workers) కోసం నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని (Free Dental Health Camp) డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, కమిషనర్ బి.వంశీకృష్ణతో కలిసి మేయర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతు..కార్మికులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దంత సమస్యలు తలెత్తిన వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు . కార్మికుల సంక్షేమానికి ఇలాంటి శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ అరవింద్ రెడ్డి, నందిని, జీశాంక్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>