కలం, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పూర్తిగా తగ్గిపోయిందిని.. గతంలో 45 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ 20 శాతానికి పడిపోయిందిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు (BJP Leader Yadagiri Sunil Rao) విరుచుకు పడ్డారు. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఓటమే ఎదురుకావడంతో ఏం చేయాలో తోచక, గత నెల రోజులుగా ‘ఎస్.ఐ.ఆర్ (SIR Process) సాకుతో ఆందోళనకు తెరలేపారని మండి పడ్డారు.
కరీంనగర్ గురువారం విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ..గత కొంతకాలం ఈవీఎంల మీద నిరాధార ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేసి పలు రాష్ట్రాల్లో 26 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఒక్క స్థానం కూడ దక్కలేదని ఎద్దేవ చేశారు.
బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగి ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ ఎన్నిక కూడ మోసం అంటారా ? ఆ పార్టీ నాయకులు పునరాలోచన చేస్కోవాలని ద్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతి సారి ఎస్ఐఆర్ పై ఆంధోళన చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకుల నైజాంగా మారిందని నిప్పులు చెరిగారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 12 సార్లు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడం జరిగిందని ఇందులో 10 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం గమనార్హం అన్నారు.
చివరిసారి ఎస్ఆర్ఐ ప్రక్రియ జరిగి 20 సంవత్సరాలు దాటిందని 2004 తర్వత 2026లో ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టి జాబితాను ప్రక్షాళన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ రకరకాల ఆరోపణలు చేస్తూ దుష్ప్రాచారం చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని విరుచుకు పడ్డారు. ఎస్ఐఆర్ చేపట్టిన తర్వతా కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిన్నమైన ఫలితాలు వెలువడ్డాయని కేరళలో కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో టీవికే మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవిషయం పై నోరు విప్పరుకానీ బీజేపి అధికారంలోకి వచ్చిన చోట మాత్రం నిరాధారణ ఆరోపణలతో దుష్ప్రాచారం చేస్తోందని దుయ్యబట్టారు.
దేశ జనాభా 140 కోట్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనలు సామాజిక పరిమాణం ప్రకారం ప్రతి వెయ్యి మందిలో ఏడాదికి 6.5 నుంచి 7.5 మంది మరణిస్తుంటారని ఈ లెక్కన 140 కోట్ల జనాభాలో ప్రతి సంవత్సరం 80 లక్షల నుంచి కోటి మంది చనిపోతున్నారని తెలిపారు. వీరిలో 18 సంవత్సరాలు నిండిన ఓటర్ల సంఖ్య 80 నుంచి 85 శాతం ఉంటుంది. మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలో అలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆందోళన చేస్తున్న ఇతర పక్షాలకు ఒరిగే లాభం ఏంటని ప్రశ్నించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిర్గతపరచాలని డిమాండ్ చేశారు.
అలాగే ఒక నగరం నుంచి మరో నగరానికి షిఫ్ట్ అయిన కోట్లాది మంది ఓటర్ల విషయంలో, డూప్లికేట్ ఓటర్లను తొలగిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏమిటని ఆ ఇబ్బంది ఏమిటో వారు ఎక్కడా చెప్పడం లేదని దాని ఆంతర్యం ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో దాదాపు 7 నుంచి 20 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా అధికారానికి దూరంగా ఉందిని తమిళనాడులో 60 సంవత్సరాల నుంచి, పశ్చిమ బెంగాల్లో 49 సంవత్సరాల నుంచి, ఉత్తరప్రదేశ్‌లో 37 సంవత్సరాల నుంచి, బీహార్‌లో 36 సంవత్సరాల నుంచి, గుజరాత్లో 31 సంవత్సరాల నుంచి, ఒడిశాలో 26 సంవత్సరాల నుంచి ఇలా సుమారు 20 రాష్ట్రాల్లో 10 నుండి 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ అధికారంలో లేకపోవడానికి సర్ ప్రక్రియకు ఏం సంబందం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం సర్ ప్రక్రియణా అని విరుచుకు పడ్డారు.
కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, అపోహలు సృష్టించడానికి మాత్రమే ఈ కృత్రిమ ఆందోళనలు చేస్తున్నారని ద్వజమెత్తారు. “యువత ఓట్లు తొలగిస్తున్నారు” అని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని కానీ 2025 తర్వాత ఇప్పటివరకు దాదాపు రెండున్నర కోట్ల మంది కొత్త ఓటర్లు, 18 సంవత్సరాలు నిండిన యువకులు ఓటర్ జాబితాలో చేరారని స్పష్టం చేశారు. మరణించిన ఓట్లు తొలగించవద్దు, డబుల్ ఓట్లు తీసేయవద్దు, షిఫ్ట్ అయిన ఓటర్లను అలాగే ఉంచాలి అంటే… ఓటర్ జాబితా తప్పులతడకగానే ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఉద్దేశము… తెలుపాలని డిమాండ్ చేశారు.
సర్ రాకముందు ఎన్నికల్లో పోలింగ్ శాతం కేవలం 50-60 శాతానికి మించేది కాదు. కానీ సర్ ప్రక్షాళన తర్వాత జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 90-92 శాతానికి పెరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు లభించి, ఓటర్లందరూ పోలింగ్‌కు వస్తే అది ప్రజాస్వామ్యానికి నిజమైన నిదర్శనం అన్నారు. ఉదాహరణకు, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాత పద్ధతిలో పోలింగ్ శాతం 50 శాతాన్ని కూడా దాటలేదు. దీన్నిబట్టి పాత ఓటర్ జాబితాల స్వరూపం ఎలాంటిదో అర్థం చేసుకోవచని స్పష్టం చేశారు. నవంబర్ 1న రాంలీలా మైదాన్లోనో, ఇంకెక్కడో ఆందోళనలు చేసుకోండి. కానీ సర్ మీద ఒక్క ఆధారం కూడా చూపించలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఉన్నాయని విమర్శించారు.
సుప్రీంకోర్టు ప్రశ్నించినా సరే, ఇప్పటివరకు ఏ ఒక్క సింగిల్ ఆధారాన్ని కూడా వారు ప్రవేశపెట్టలేక పోవడం చాలా దుర్మార్గం అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తాము వెనుకబడిపోతున్నామనే భయంతో ఇలాంటి కృత్రిమ ఆందోళనలకు దిగుతున్నారని దీని వెనుక ఎవరున్నారు, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అనేది ప్రజలందరికీ స్పష్టంగా తెలుసన్నారు. బెంగాల్, కేరళ, తమిళనాడు ఎన్నికల్లో ఏ ఒక్క ఓటరూ వచ్చి “నా ఓటు ఎందుకు లేదు?” అని ప్రశ్నించలేదని గుర్తు చేశారు.
ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరి ఓటూ అక్కడ ఉంది కాబట్టే 92-93 శాతం పోలింగ్ నమోదయిందని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12-13 సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న భారతదేశ శక్తిని చూసి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఇవన్నీ గమనించకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు నరేంద్ర మోడీ మీద, వారి తల్లిదండ్రుల మీద పరుష పదజాలం వాడితే బీజేపీ పరపతి తగ్గదు, ఇంకా పెరుగుతుంది. 12-13 సంవత్సరాలుగా ఒక్క చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా దేశం కోసం పనిచేస్తున్న ప్రధాని మోడీ పట్ల ప్రజల్లో సానుభూతి, ఆదరణ అంతకంతకూ పెరుగుతుంటాయని.. కాబట్టి అబద్ధపు ప్రచారాలు, కల్లబొల్లి మాటలతో కృత్రిమ ఆందోళనలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్స్ వంగల పవన్, కొంపెల్లి రామణ్, బండారి వేణు, బండ రమణారెడ్డి, గాజ శివరాం, మేకల వెంకటేష్, కేఏపిపి చంద్ర, మాసం గణేష్, సోమిడి వేణు, పొన్నం మొండయ్య గౌడ్, గొట్టేముక్కల వెంకటరమణ, కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, చిగురు రవి, బీజేపీ నాయకులు కటకం లోకేష్ కుమార్, బండి ప్రశాంత్, సత్తిరెడ్డి, వెంకటరెడ్డి, పండుగ నాగరాజు, అబ్దుల్ హమీద్, కుంభం అనిల్, అమీర్, అజ్జు, ఖాజా, ఫరూక్, మోతే శ్రీనివాస్ పాల్గొన్నారు.

