భైంసా అభివృద్ధిపై తప్పుడు ప్రచారం తగదు : ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

కలం, భైంసా: ముధోల్ నియోజకవర్గాన్ని ప్రణాళికాబద్ధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే, కొందరు దుష్టశక్తులు అభివృద్ధి చేయడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) అన్నారు. గురువారం భైంసా పట్టణంలోని రామ్‌లీలా మైదానంలో రూ.50 లక్షల నిధులతో నిర్మించనున్న శివ రామాలయానికి (Shiva Rama Temple) ఆయన భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే శ్రీరామ నవమి నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత శ్రీరామ నవమి సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం శివ రామాలయ నిర్మాణానికి రూ.40 లక్షల నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ప్రస్తుతం రూ.50 లక్షల వ్యయంతో ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు పేర్కొన్నారు. భైంసాలో భవ్యమైన రామాలయాన్ని నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్ఠ, ఇతర కార్యక్రమాలకు తన సొంత డబ్బులను కూడా ఖర్చు చేస్తానని చెప్పారు.

తన హయాంలో సరస్వతీ అమ్మవారి ఆశీస్సులతో బాసర ఆలయ అభివృద్ధి, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, అదేవిధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోళ్ల దత్తాత్రి, ప్రముఖ పూజారి బాబృ మహారాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బి. గంగాధర్, కౌన్సిలర్ చింతపండు రజిత మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>