పెండింగ్ పనులు పూర్తి చేయండి.. అధికారులకు కలెక్టర్ ఆదేశం!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాల్లో పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేసి, ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని 71 ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాల్లో మిగిలిపోయిన పనులను గుర్తించి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

ప్రతి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో చేపట్టాల్సిన పనులు, వాటి పురోగతిని సమీక్షిస్తూ, నిర్దేశిత గడువులోగా అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, మౌలిక సదుపాయాలన్నీ కల్పించిన అనంతరం ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. మధుసూదన్ నాయక్, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి, ఆ శాఖ డిప్యూటీ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>