మంజీరా తీరంలో కలకలం.. పొలంలోకి మొసలి!

కలం, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎంకేపల్లి గ్రామ శివారులోని ఓ పంట పొలంలో మొసలి (Medak Crocodile) ప్రత్యక్షం కావడంతో స్థానిక రైతులు, గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వనదుర్గ భవానీ ప్రాజెక్టు, మంజీరా పరిసర ప్రాంతాల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడంతోనే ఈ మొసలి నీటి నుంచి బయటకు వచ్చి పొలంలోకి ప్రవేశించి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

విషయం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు అప్రమత్తమై సంగారెడ్డి నుంచి ప్రత్యేక రెస్క్యూ టీమ్‌ను ఘటనా స్థలానికి రప్పించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ మొసలిని సురక్షితంగా బంధించారు. అనంతరం దానిని జనసంచారానికి దూరంగా సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంజీరా పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ పనులు చేసుకునే రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. పొలాల వద్ద మొసలి సంచారం కనిపిస్తే వెంటనే దూరంగా ఉండి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>