ఐదేళ్లలోపు పిల్లలకు ఈ ఆహారాలు పెడుతున్నారా? తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త!

కలం, వెబ్ డెస్క్:  ఐదేళ్లలోపు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. అందువల్ల వారు తినే ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ వయసు పిల్లల్లో పళ్లు పూర్తిగా ఏర్పడినా, ఆహారాన్ని సరిగ్గా నమలడం అలవాటు కాదు. ఫలితంగా కొన్ని రకాల పదార్థాలు వారి శ్వాసనాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు వారి జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు ఎటువంటి ఆహారాలు అస్సలు ఇవ్వకూడదో (Kids Health Alert) ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలకు ఇవ్వకూడని ఆహార పదార్థాలు
1. డ్రై ఫ్రూట్స్, నట్స్

బాదం, వేరుశనగ, జీడిపప్పు, వాల్ నట్స్ వంటివి ఆహారానికి మంచివే ఐనప్పటికీ పిల్లలకు వీటిని నేరుగా ఇవ్వకూడదు. వీటిని నమలకుండా మింగేయడం వల్ల ఊపిరి ఆడకుండాపోయే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే వీటిని మెత్తని పొడిగా మార్చి మాత్రమే ఆహారంలో కలపాలని సూచిస్తున్నారు.

2. గట్టిగా, గుండ్రంగా ఉండే పండ్లు

గ్రేప్స్, క్యారెట్ ముక్కలు, ఆపిల్ ముక్కలను అలాగే తినిపించవద్దని చెబుతున్నారు. వీటిని చిన్న ముక్కలుగా కోసి లేదా బాగా ఉడికించి మెత్తగా చేసి ఇవ్వాలట. లేదంటే ఇవి గొంతుల్లో అడ్డు పడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

3. గట్టి మిఠాయిలు, క్యాండీలు

జిగురుగా ఉండే బబుల్ గమ్స్, చాక్లెట్లు, గట్టి టాఫీలు, ఫ్రూట్ రోల్స్ వంటి పదార్థాలను పిల్లలకు అస్సలు ఇవ్వొద్దని చెబుతున్నారు. ఇవి శ్వాసనాళంలో ఇరుక్కునే ప్రమాదం ఉందని, అంతే కాకుండడా వీటి వల్ల పళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు.

4. ఫ్రైడ్, జంక్ ఫుడ్స్

నూనెలో బాగా వేయించిన చిప్స్, ఫాస్ట్ ఫుడ్స్ కు పిల్లలను దూరంగా ఉంచాలని చెబుతున్నారు. ఇవి శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్ ను పెంచి, చిన్న వయసులోనే అధిక బరువు సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

5. అధిక చక్కెర గల పానీయాలు

మార్కెట్లో దొరికే ఫ్యాక్ చేసిన ఫ్రూట్ జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ లో చక్కెర శాతంతో పాటు రసాయనాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అందుకే వీటికి బదులుగా ఇంట్లోనే తాజా పండ్ల ముక్కలు లేదా సహజమైన రసాలను అలవాటు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

అంతే కాకుండా పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కేవలం కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లే కాకుండా విటమిన్–డి, క్యాల్షియం వంట పోషకాలు కూడా ఎంతో అవసరమని చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>