రైతుల కోసం గంగ‌క‌త్వ ప్రాజెక్టు అధునీక‌ర‌ణ‌ : జ‌గ్గారెడ్డి

క‌లం, మెద‌క్ బ్యూరో : ఏడో నిజాం కాలంలో నిర్మించిన గంగకత్వ ప్రాజెక్టును, కాలువల‌ను ఆధునీకరించే అవకాశం రావడం సంతోషంగా ఉందని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. సదాశివపేట మండలం సూరారం గ్రామంలోని గంగకత్వ ప్రాజెక్టును పరిశీలించిన ఆయన, సాగునీటి శాఖ అధికారులు, ఆయకట్టు గ్రామాల రైతులు, స్థానిక నాయకులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాలని, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని అధికారులను ఆదేశించారు. గంగకత్వ కాలువ పరిధిలోని 11 గ్రామాల్లో 3,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. స‌దాశివపేట మండలంలో సుమారు 16 కిలోమీటర్ల మేర విస్తరించిన కాలువకు 28 చెరువులు అనుసంధానమై ఉన్నాయని జగ్గారెడ్డి చెప్పారు. లీకేజీల నివారణకు చర్యలు తీసుకుంటున్నామ‌న్నారు.

కాలువను ఆధునీకరించి, చివరి ఆయకట్టు వరకు నీరందించడమే లక్ష్యమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాలువ లైనింగ్‌, దెబ్బతిన్న భాగాల మరమ్మతులు, పక్కలకు సీసీ లైనింగ్‌, తూముల పునరుద్ధరణ, వంతెనల వెడల్పు పెంపు తదితర పనులపై సమీక్షించారు. కాలువ పొడవునా తనిఖీలకు ఉపయోగపడే దారిని పునరుద్ధరించాలని సూచించారు. కాలువ నీరు చెరువులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన (Jagga Reddy) అధికారులను ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>