కలం, కరీంనగర్: చొప్పదండి (Choppadandi) మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా (BJP Kisan Morcha) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు మొగిలి మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు చొప్పదండి డిప్యూటీ తహసీల్దార్ సర్దార్ మన్మిత్ సింగ్కు వినతిపత్రం సమర్పించారు.
గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీల వారీగా నీటి ఎద్దడి నివారణకు ప్రణాళిక రూపొందించాలని కృష్ణారెడ్డి కోరారు. కరువు పరిస్థితుల వల్ల బావులు ఎండిపోవడంతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలువ నీరు కూడా అందక రైతులు పంటలు నష్టపోతున్నారని తెలిపారు. నష్టపోతున్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పొలాలు బీళ్లుగా మారే ప్రమాదం ఉన్నందున రైతు కూలీలకు ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సంవత్సరానికి రూ.12 వేల చొప్పున, మూడు సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ నిధులు ప్రతి కూలీకి రూ.36 వేల చొప్పున విడుదల చేయాలని కోరారు. రైతుల రుణాలపై వడ్డీని మాఫీ చేయడంతో పాటు దీర్ఘకాలిక రుణాల కిస్తులను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గొల్లగట్టయ్య, మండల ప్రధాన కార్యదర్శులు జిట్ట కుమార్, కొమ్ము రమేష్, ఎడ్ల సురేష్, చల్ల అనూష్, సీనియర్ నాయకులు తోట కోటేష్, బైరగొని కిట్టు గౌడ్, తిరుపతి గౌడ్, జక్కుల శంకర్, తాటికొండ కుమార్, రాపెళ్లి శ్రీనివాస్, మంచి కట్ల మల్లేష్, కళ్లెం మనిష్ రెడ్డి, అమర కొండ తిరుపతి, గుండె వెంకటేష్, గుర్రం సమరసింహారెడ్డి, సాదుల రమేష్, వడ్లూరి సుధాకర్, ముద్దం చందు, పాలోజి వెంకటరమణ, అఖిల్, లింగంపల్లి కళ్యాణ్, మ్యాకల రాములు, మడ్డి పరుశురాములు, రాజేందర్, పోరండ్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

