కలం, నారాయణపేట: నారాయణపేట (Narayanpet) జిల్లా కేంద్రంలో నవంబర్ 1న సాయంత్రం 4 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా పథ సంచలన్ నిర్వహిస్తున్నట్లు నగర సంఘ్ చాలక్ డా. మదన్ మోహన్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నారాయణపేట, దామరగిద్ద, ఉట్కూరు శాఖల నుంచి స్వయం సేవకులు ఈ పథ సంచలన్లో పాల్గొంటారన్నారు.
నారాయణపేట ఖండ స్వయం సేవకులు పళ్ళ హరిజనవాడ హనుమాన్ మందిరం, ఊట్కూరు ఖండ స్వయం సేవకులు షీలా గార్డెన్, దామరగిద్ద ఖండ నుంచి నారాయణపేట బారంబావి నుంచి స్వయం సేవకులు పథ సంచలన్ లో పాల్గొంటారన్నారు. చివరకు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం మైదానం కి చేరుకుంటారని అక్కడ ముఖ్య అతిథులు ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

