కలం, హనుమకొండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. బుధవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఆర్‌ఎస్‌వీ (BRSV) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని(Voter Enrolment Centre) వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలు, గ్రంథాలయాన్ని సందర్శించి ఉద్యోగులు, పట్టభద్రులు, పరిశోధక విద్యార్థులకు ఫారం-18 ద్వారా ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఓటరు నమోదును సామాజిక బాధ్యతగా భావించాలని వినోద్‌కుమార్ సూచించారు. ప్రశ్నించే హక్కును వినియోగించుకోవాలంటే ముందుగా ఓటరుగా నమోదు కావాలని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ చింతకాయల దినేష్‌కుమార్, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీఆర్‌ఎస్‌వీ నాయకులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

