కలం, వెబ్డెస్క్: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP State Election Commission) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో (MPTC ZPTC Elections) కీలక మార్పులు చేసింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలకు కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. గత నోటిఫికేషన్ ప్రకారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు, పరిషత్ ఎన్నికలకు ఒకే రోజును నిర్ణయించారు. దీంతో పోలింగ్ సిబ్బంది, పోలీసుల కొరత ఏర్పడనుందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో స్వల్ప మార్పులతో కొత్త షెడ్యూల్ ప్రకటించారు. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం ఏపీలో నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. నవంబర్ 5న ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన చోట నవంబర్ 6న పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే 7న ఫలితాలు విడుదల చేయనున్నారు.
Also Read : ‘అర్నబ్’ దెబ్బకు ఏడుగురు మృతి!
Follow Us On : WhatsApp

