కరువు గుప్పిట్లో వలిగొండ.. ఆశలు రేపుతున్న మబ్బులు!

కలం, వలిగొండ: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాలలో వలిగొండ (Valigonda Drought) మండలం కూడా కరువు మండలంగా ప్రకటించడం జరిగింది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గిపోవడంతో వలిగొండ మండలం కూడా ఎల్ నినో ఎఫెక్ట్ తో మధ్యస్థ సగటు వర్షపాతం మాత్రమే నమోదు అవుతుందని కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు పంటలు సాగు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండగా ప్రజలకు తాగునీటి కష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే ‘అర్నబ్’ తుఫాన్ వలిగొండ మండలం పై తన ప్రభావాన్ని చూపిస్తే కొంతమేరకు సాగు, తాగు నీటి కష్టాల పరిస్థితి మెరుగవుతుందని ఆకాశంలో ఏర్పడిన మబ్బులను రైతులు, ప్రజలు ఆశగా చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>