చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తా: కర్నాటి వజ్రమ్మ

కలం, మునుగోడు : ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ, న్యూఢిల్లీ బోర్డు డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం తనకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని కర్నాటి వజ్రమ్మ వెంకటేశం (Karnati Vajramma) అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఈ పదవికి ఎన్నికైన తొలి తెలంగాణ మహిళగా గుర్తింపు పొందడం తనకు దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు. చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయడంతో పాటు, చేనేత ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, కార్మికులకు తగిన గుర్తింపు లభించేలా పనిచేయడం తన లక్ష్యమని చెప్పారు.

చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల అభ్యున్నతికి సంబంధిత వర్గాల సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చేనేత రంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>