epaper
Friday, January 16, 2026
spot_img
epaper

కర్నూలు జిల్లాలో దారుణం.. వేటకొడవళ్లతో దాడి ఇద్దరు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. మండల పరిధిలోని కందనాతి (Kandanathi) గ్రామంలో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురవ్వగా, ఒక బాలుడు సహా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కందనాతి గ్రామానికి చెందిన పరమేశ్​, వెంకటేశ్​ అనే వ్యక్తులు తమ పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. అప్పటికే మాటు వేసిన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు.

నిందితులు అతి కిరాతకంగా దాడి చేయడంతో పరమేశ్​, వెంకటేశ్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సమయంలో వారి వెంట ఉన్న మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒక చిన్న బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Read Also: సినిమాల్లోకి వెళ్లాలనుకునే వారికి ఛాన్స్ ఇస్తున్న దీపిక పదుకొణె

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>