తుమ్మిడిహెట్టి పేరుతో కాలయాపన : ఎర్రబెల్లి దయాకర్‌రావు

కలం, వరంగల్‌ బ్యూరో : తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు(Tummidihatti Project)పై ఒప్పందాలేవీ కుదరకముందే చర్చలు సఫలమయ్యాయని ప్రచారం చేసుకోవడంపై బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రాజెక్టులపై అవగాహన లేకుండా సీఎం, మంత్రులు, ఎంపీలు మాట్లాడుతున్నారన్నారు. మంగళవారం తొర్రూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మూడుసార్లు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చర్చలు జరిపారని ఎర్రబెల్లి (Errabelli Dayakar Rao) తెలిపారు. బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించినా, మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అది కార్యరూపం దాల్చలేదన్నారు. కేంద్ర జల సంఘం నివేదికల ఆధారంగా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై అంచనాలు వేసిన తర్వాతే కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు బీఆర్‌ అంబేద్కర్‌ వార్ధా ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, మేడిగడ్డ సమస్యను సాకుగా చూపి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిలిపివేసిందని ఆరోపించారు. మేడిగడ్డను మరమ్మతు చేసి నీటిని అందించడంలో విఫలమైన ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఫొటోలకు పోజులిస్తోందని ఎర్రబెల్లి విమర్శించారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేయడం తప్ప తెలంగాణకు నీళ్లు అందే పరిస్థితి కనిపించడం లేదని దయాకర్ రావు విమర్శించారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాల హయాంలోనూ ఈ ప్రాజెక్టుపై కమిటీలు వేయడం మినహా తెలంగాణకు ప్రయోజనం చేకూరలేదని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రచారానికి స్వస్తి చెప్పి, సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Also Read : ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు హరీశ్ రావు సపోర్ట్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>