మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్.. కారణమిదే!

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు హస్తినలోనే ఉండబోతున్నారు. డిసెంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో బడా పెట్టుబడిదారులు, వివిధ కంపెనీల అధినేతలతో సమావేశం కాబోతున్నారు. సమ్మిట్‌కు వారిని ఆహ్వానించడంతో కొత్తగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరబోతున్నారు. పలు అంతర్జాతీయ కంపెనీలను కూడా సదస్సుకు రప్పించి, వాటితో ఒప్పందాలు కుదుర్చుకోవాలని యోచిస్తున్నారు.

కాంగ్రెస్ నిరసన ర్యాలీలో..

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నవంబర్ ఒకటో తేదీన కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోతున్న భారీ ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నారు. తెలంగాణ నుంచి భారీగా పార్టీ శ్రేణులు హస్తినకు తరలి వెళ్లబోతున్నారు. రాంలీలా మైదానంలో చేపట్టే ఈ ధర్నా కార్యక్రమంలో రాహుల్ గాంధీతో కలిసి సీఎం రేవంత్ నడవబోతున్నారు. ఈ పర్యటనలోనే వీలైతే కొందరు కేంద్ర మంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read : ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు హరీశ్ రావు సపోర్ట్..!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>