కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) (TRASMA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధానోత్సవానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, వెడ్మ బొజ్జు పటేల్ లకు ట్రస్మా సభ్యులు మంగళవారం ఆహ్వాన పత్రిక అందజేశారు.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 14, ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ సమీపంలో గల ఆర్కే కన్వెన్షన్ హాల్లో గురుశ్రేష్ఠ అవార్డుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి వారికి అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్యామ్, రాష్ట్ర ఈసీ సభ్యులు పడాల ప్రభాకర్, షబ్బీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

