భద్రాద్రి రామయ్య సేవలకు భక్తుడి భారీ విరాళం

కలం, ఖమ్మం బ్యూరో : దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలంలోని (Bhadrachalam) ప్రసిద్ధ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వామివారి కైంకర్యాలు, నిత్య సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం హైదరాబాద్‌కు చెందిన కశ్యప్ రాజేష్ పటేల్ మంగళవారం భారీ విరాళాన్ని అందజేశారు. శ్రీరామచంద్రునిపై ఉన్న అపారమైన భక్తి విశ్వాసాలతో ఆలయ అభివృద్ధి, సేవా కార్యక్రమాల కోసం మొత్తం రూ.15.3 లక్షలను విరాళంగా సమర్పించారు.

ఈ విరాళంలో నిత్యాన్నదానానికి రూ.9 లక్షలు, గోశాల నిర్వహణ, సంరక్షణకు రూ.5.55 లక్షలు, శాశ్వత కల్యాణానికి రూ.75 వేల చొప్పున కేటాయించారు. నిత్యం భక్తులకు అందించే అన్నప్రసాద వితరణతో పాటు గోమాతల రక్షణకు, స్వామివారి కల్యాణ సేవలకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఒకే వ్యక్తి ఇంత భారీ మొత్తంలో విరాళం అందించడం పట్ల భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన (Bhadrachalam Temple) అధికారులు, అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. కశ్యప్ రాజేష్ పటేల్ దంపతులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆలయ వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. ఇలాంటి భక్తుల సహకారంతో దేవస్థానంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మరింత ఘనంగా ముందుకు సాగుతాయని అధికారులు పేర్కొన్నారు.

Also Read : 100 ఎమ్మెల్యే సీట్లు మా టార్గెట్: మహేశ్ గౌడ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>