చిన్నారుల అసభ్య వీడియోలు అప్‌లోడ్‌.. ఇద్దరు యువకులు అరెస్ట్‌

కలం, నిర్మల్‌: సోషల్ మీడియాలో చిన్నారులకు సంబంధించిన లైంగిక వీడియోలను (Child Sexual) అప్లోడ్‌ చేసి, ఇతరులు చూసేలా చేసిన ఇద్దరు యువకులను పోలీసులు (Nirmal Police) అరెస్ట్‌ చేసినట్టు సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి(CI Goverdhan Reddy) తెలిపారు. మంగళవారం సోన్ సర్కిల్ కార్యాలయంలో కేసుకు సంబందించిన వివరాలను వెల్లడించారు.

మామడ మండలం కమలకోట్ గ్రామానికి చెందిన యువకుడితో పాటు సోన్ మండలం సాకేరా గ్రామానికి చెందిన మరో యువకుడు వివిధ ఆన్లైన్‌ వెబ్ సైట్లలో అసభ్యకర చిత్రాలు, చిన్నారులకు సంబంధించిన లైంగిక వీడియోలను వీక్షించినట్లు తెలిపారు. అనంతరం వాటిని ఇతరులు చూసేలా తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ద్వారా అప్లోడ్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం మంగళవారం ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>