కలం, వెబ్ డెస్క్ : అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, రాబోయే తుఫాన్ ముప్పు, రాజకీయ పరిణామాలపై కీలక ప్రసంగం చేశారు. కేంద్ర ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా శాయశక్తులా కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ, ముందస్తుగా అన్ని రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసి తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తుఫాన్ ముప్పు.. చంద్రబాబు కీలక హెచ్చరికలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై స్పందిస్తూ, ఎల్‌నినో తర్వాత తాజాగా ‘అర్నాబ్’ తుఫాన్ (Cyclone Arnab) ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. రేపు మధ్యాహ్నం తుఫాన్ తీరం దాటనుందని, రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తాము, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ దేశ మధ్యభాగంలో ఉండటం వల్ల తుఫాన్లు రావడం సహజమని, వాటిని ఎదుర్కొని ముందుకు సాగడమే మన కర్తవ్యమని అన్నారు.
గత వైసీపీ పాలనలో రాష్ట్రం విధ్వంసానికి గురైందని, 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో అద్భుత విజయాన్ని అందించడం ద్వారా ఆ పాలకుల పాలనపై తమ విసుగును చాటారని చంద్రబాబు ఎత్తిచూపారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను ప్రజలు తమకు అప్పగించారని పేర్కొన్నారు.
రాజకీయంగా విపక్షంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu), తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇష్టం లేకనే వారు అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. కూటమి అధికారిక అభ్యర్థుల విజయం కోసం అన్ని పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, రేపటి నుంచి బాధ్యతగా పనిచేయని వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని, వారు ఇకపై టీడీపీ సభ్యులు కారంటూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
Also Read : దూసుకొస్తున్న ‘అర్నబ్’.. ఆ జిల్లాలకు హై అలర్ట్ !
Follow Us On: Youtube

