కాళేశ్వరాన్ని ‘కూలేశ్వరం’ చేశారు: హరీష్ రావుపై చామల ఫైర్!

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావుపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage), కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాల గురించి మాట్లాడితే హరీష్ రావుకు ఎక్కడ లేని కోపం వస్తోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, తన పాలనలోని దరిద్రపు విధానాల వల్ల కాళేశ్వరాన్ని కాస్తా ‘కూలేశ్వరం’గా మార్చారని ఫైర్ అయ్యారు.

మేడిగడ్డ వద్ద గతంలో నీటిని లిఫ్ట్ చేసే అవకాశం లేదని, ప్రస్తుతం కూడా లేదన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఆ బ్యారేజ్ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఎంపీ చామల (MP Chamala) స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నీటి మట్టాల గురించి తాము ప్రస్తావిస్తే, మేడిగడ్డ నుంచి ఏపీకి 20 వేల క్యూసెక్కుల నీళ్లు తరలిపోతున్నాయంటూ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిన నిజం తెలంగాణ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే గోదావరి నీరు వృథాగా కిందకు జారిపోతోందని విమర్శించారు. అదే సమయంలో దేవాదుల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు విజయవంతంగా నడుస్తున్నాయని వెల్లడించారు.

Also Read : కృష్ణా జలాల పంపిణీపై ఉత్కంఠ.. KRMB భేటీ మళ్లీ వాయిదా!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>